SADAREM Slots Open 2025:
SADAREM Slots Open 2025 – వికలాంగులుగా ఉండి ఎవరైతే బాధపడుతూ సదరం సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి శుభవార్తగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రధానంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్ళు అనగా దివ్యాంగులకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సదరం అనేది ఏంటి అంటే ప్రభుత్వం వారి చేత మీకు Disability certificate – దివ్యాంగ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

సదరం సర్టిఫికెట్ అంటే ఏంటి?
SADAREM – software for assessment of disabled for access, Rehabilitation & Empowerment. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అనగా అంగవైకల్యం ఎవరికి అయితే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్ళు అంగవైకల్యం గలవారు ఉన్నారో వారికి కొన్ని బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి.
సదరం సర్టిఫికెట్ వల్ల బెనిఫిట్స్ :
- RTC Bus, Train లో ఉచితంగానే మీరు ప్రయాణించవచ్చు
- నెలవారి పెన్షన్ పొందవచ్చు
- ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాలో జాబు పొందవచ్చు
- చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ పొందవచ్చు
- ఆరోగ్యశ్రీ మరియు వైద్య భీమా కూడా పొందవచ్చు
- స్వయం ఉపాధి పొందడానికి బ్యాంకు వారు మీకు లోన్స్ ఇస్తారు
- కాలు లేని వారికి వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు
- చెవిటి వారికి వినికిడి పరికరాలు అందిస్తారు
- చూపు లేని వారికి లేదా ఏదైనా లోపం గల వారికి సంబంధిత పరికరాలు ఉచితంగానే అందిస్తారు.
ఇలాంటి సర్టిఫికెట్ వల్ల ఎవరైతే వికలాంగత్వంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఎంతో మేలు చేకూరుతుంది. అంతేకాకుండా వాళ్లు కూడా ఉపాధి అవకాశాల్ని స్వయంగానే సృష్టించుకునే విధంగా ఆర్థిక సహాయం అందించడం దీనితోపాటు ఒకవేళ వాళ్ళకి వికలాంగత్వం ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్లకి కావాల్సినటువంటి పరికరాలు కూడా ఉచితంగానే మనకు ఈ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందించడం చాలా మంచి విషయం గా చెప్పవచ్చు. ఇవే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని రిజర్వేషన్ సీట్లు అనేవి కేటాయించడం వలన వాళ్లకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విధంగా కూడా చక్కటి అవకాశం కూడా ఉండడం విశేషం. ఇలాంటి గొప్ప స్కీమ్స్ అనేవి తీసుకురావడం వల్ల వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం వారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేయాలి కచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాలి.
ఈ మధ్యకాలంలో వికలాంగులు కూడా చాలా కష్టపడుతున్నారు వారు కూడా స్వయం ఉపాధి అవకాశాల్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకి కూడా వివిధ రంగాలలో చాలావరకు స్కిల్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి వాళ్లు కూడా భవిష్యత్తులో ఇంకా గొప్ప ఉన్నత స్థానాలకు కూడా వెళ్తున్నారు.
ఉద్యోగిని పథకం – 3 లక్షల రుణాలు
సదరం సర్టిఫికెట్ – అర్హులు ఎవరు?
- 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగినటువంటివారు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే అర్హులు
- గవర్నమెంట్ మెడికల్ బోర్డు పరీక్షలో అర్హత ఉండాలి
- వయసుతో సంబంధం లేకుండా చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా అర్హులే.
సదరం కి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?
- ఒరిజినల్ ఆధార్ కార్డు
- వైకల్యం కలిగినటువంటి ఫోటోలు
- మొబైల్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి
- అడ్రస్ ప్రూఫ్ కోసం – బ్యాంకు పాస్బుక్ / ఓటర్ ఐడి / రేషన్ కార్డు
సదరం కి ఎలా అప్లై చేయాలి?
- AP SADAREM Booking Online అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలి.
- Other Services లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు Health Department అనే ఆప్షన్ కనపడుతుంది దానిమీద నొక్కితే మీకు Family Welfare అనే ఆప్షన్ ని ఎంపిక చేయాలి.
- SADARAM Certificate Slot Book అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- Name, Mobile No., Aadhar Card No. డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తే మీకు OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబర్ కి వస్తుంది.
- కావలసిన జిల్లా మరియు హాస్పిటల్లో పేరుని మీరు ఎంచుకోండి.
- SUBMIT చేసేయండి.
- మీకు ఒక రిసిప్ట్ కూడా వస్తుంది దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
SADAREM – Status ఎలా చెక్ చేయాలి?
- SADAREM – Status Checkలో మీ యొక్క SADAREM ID & CAPTCHA ఎంటర్ చేయండి.
- ఎంపిక చేసుకున్నటువంటి హాస్పిటల్ నేమ్ తో పాటు డేట్ మొత్తం అన్ని కూడా వివరాలు కనిపిస్తాయి.
- WL – వెయిటింగ్ లిస్టు అని కనిపిస్తే కనుక మీరు మళ్ళీ స్లాట్ కోసం వెయిట్ చేయాలి.