NVS KVS Recruitment 2025:
నిరుద్యోగులు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కు సంబంధించిన భారీ NVS KVS Recruitment 2025 వచ్చేసింది.

ఈ NVS KVS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు మరియు సెలక్షన్ ప్రాసెస్ తదితర అంశాల గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలలో భాగంగా మనకు టీచింగ్ జాబ్స్ తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. 10th, 12th, Degree, B. Ed, D. Ed వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.
ఇందులో సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి Tier 1 & 2 పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం మీకు పరీక్షతోపాటు ఇంటర్వ్యూ మరియు డెమో కూడా ఉంటుంది.
Job Details :
ఈ NVS KVS Recruitment 2025 మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో భారీ మొత్తంలో పోస్టులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ వారు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Vacancies :
ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక 14,967 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మనకు టీచింగ్ జాబ్స్ ఉన్నాయి మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి.
PGT, TGT, PRT, Principal వంటి టీచింగ్ జాబ్స్ తో పాటు MTS, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వంటి విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
Tips to Get Good Marks in 10th Class Exams
Age:
ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా పోస్ట్ ఆధారంగా చేసుకుని 50 సంవత్సరాలు వరకు కూడా వయస్సు మీకు ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Women, PWD – 10 Years
Salary :
ఇక NVS KVS Recruitment 2025 లో విడుదల చేసినటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు విషయానికి వచ్చినట్లయితే గనుక పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మనకు దాదాపుగా ₹30,000/- to ₹80,000/- మధ్యలో అన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మీకు చేతికి అందుతుంది.
మీరు ఒకవేళ ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే గనక మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఉండడానికి రూమ్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు మరియు మీకు సంబంధించి క్వార్టర్స్ ఉంటాయి. మీకు భోజన సదుపాయం కూడా వాళ్ళు ఇస్తారు.
Important Dates :
- ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే Nov 14th to Dec 4th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవాలి.
- వీటికి అప్లై చేసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ లో మీకు ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా ఉంటుంది దానిని ఫాలో అయిపోయి మీరు అయితే అప్లై చేయొచ్చు.
- పరీక్ష తేదీ అనేది త్వరలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి నోటిఫికేషన్ లో ఇంకా ఇవ్వలేదు దాదాపుగా మనకొక రెండు నెలలు సమయం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Fee:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అనేవి క్రింది విధంగా ఉంటే ఒకసారి గమనించి దానికి అనుగుణంగా మీరైతే అప్లై చేసుకోండి. ఒక్కొక్క పోస్ట్ కి సపరేట్గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి గమనించండి.
- SC, ST, PWD – 500/-
- UR, OBC, EWS – 1700/- & ₹2,000/-
KVS అంటే ఏమిటి?
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ – KVS అనేది కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాల గా చెప్పొచ్చు. దీని ద్వారా చాలా మంచి విద్యను చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని పిల్లలకి అందించడం జరుగుతుంది.. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్సలెంట్ గా ఉండడంతో పాటు మీకు నివసించడానికి స్టే కూడా వాళ్లే మీకు ప్రైవేట్ చేయడం జరుగుతుంది.
ఎటువంటి జాబ్స్ అనేవి భర్తీ చేస్తారు?
- ఇందులో భాగంగా మనకు టీచింగ్ జాబ్స్ తో పాటు నాన్ టీచింగ్ జాబ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
- ప్రైమరీ టీచర్ – PRT: ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేటటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – TGT : ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి టీచర్గా చెప్పొచ్చు.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – PGT : 11th – 12th తరగతి పిల్లలకి సబ్జెక్టు టీచింగ్ చేయడం జరుగుతుంది.
- వీటితోపాటు ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ & నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి.
ప్రిపరేషన్ టిప్స్:
PYQ – ప్రీవియస్ ఇయర్ క్యూస్షన్స్ అనేవి తప్పనిసరిగా చూసుకోవాలి. తద్వారా మీకు బిట్టు ఫ్రేమ్ ఏ విధంగా చేయడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అసలు ప్రశ్నలు అనేవి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు వేటుపని ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది మీరు ప్రివియస్ క్యూస్షన్స్ చూడటం వల్ల మీకు తెలుస్తుంది. అలాగే బిట్ అనేది ఎంత డెప్త్ గా అడుగుతున్నారు అనేది కూడా తెలుస్తుంది.
- మీరు మార్క్ టెస్ట్ లు అటెంప్ట్ చేయడం ద్వారా మీకు ప్రాక్టీస్ అవ్వడంతో పాటు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది.
- డైలీ మీరు స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సిలబస్ ని క్లియర్ చేయవచ్చు.
- టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకము ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా మీరు ఎగ్జామ్ లో ఎడ్యుకేషన్ లేకపోతే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కచ్చితంగా టైం మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి.
Apply Process:
ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో విడుదల చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఉంటుంది. ముందుగా మీరు వివరంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి దానితోపాటు మీకు ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేది మీరు బ్రేకప్ వేకెన్సీస్ లో చెక్ చేసుకోవాలి.
అన్ని క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత మీకు NVS KVS Recruitment 2025 లోనే క్లియర్ గా ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ అనేవి ఫాలో కావాలి అని చెప్పి. వాటిని ప్రాపర్ గా ఫాలో అవుతూ ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు అయితే అప్లై చేసుకోవాలి.
FAQ:
KVS జాబ్స్ కి అప్లై చేయాలంటే CTET తప్పనిసరిగా ఉండాలా?
KVS మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి ఇందులో మెయిన్ గా మనకు టీచింగ్ జాబ్స్ లో ప్రైమరీ టీచర్ జాబ్స్ కి CTET 1 మరియు TGT జాబ్స్ కి CTET 2 పేపర్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. PGT ఉద్యోగాలకు సంబంధించి CTET క్వాలిఫికేషన్ అవసరం లేదు. నాన్ టీచింగ్ జాబ్ కి CTET అవసరం లేదు డైరెక్ట్ అప్లై చేయొచ్చు.
KVS ఉద్యోగాలకు దరఖాస్తులు ఎలా చేయాలి?
KVS సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు ఆన్లైన్ విధానములు అప్లై చేయొచ్చు.
KVS జాబ్స్ కి అమ్మాయిలు కూడా అప్లై చేయొచ్చా?
KVS జాబ్స్ కి సంబంధించి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఎవరైనా అప్లై చేయొచ్చు. అన్ని రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
KVS ఉద్యోగం పొందినట్లయితే జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది?
KVS. లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కి మీరు ఎంపికైనట్లయితే జాబ్ పోస్టింగ్ అనేది మీకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో ఇవ్వడం జరుగుతుంది.. మన తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం మరియు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో మనకి ఒక కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనేవి ఉన్నాయి. అక్కడే మీకు జాబ్ ఇవ్వడంతో పాటు మీకు రూమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
KVS ఎగ్జామ్ అనేది చాలా కష్టంగా ఉంటుందా?
KVS పరీక్ష అనేది మీరు ఎంపిక చేసుకున్నటువంటి పోస్ట్ ఆధారంగా డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో మీకు ఆన్సర్స్ అనేవి ప్రతి క్వశ్చన్ కి తెలిసినప్పటికి కూడా అక్కడ మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ముగింపు:
KVS ఉద్యోగం మీ లక్ష్యం అయితే కనుక ప్రిపరేషన్ అనేది త్వరగా స్టార్ట్ చేసుకోండి. ఒక ప్లాన్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం మీరు మీ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకొని వెళుతున్నట్లయితే తప్పనిసరిగా మీకు Success దక్కుతుంది.నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీరు మెయిన్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు అన్నీ కూడా ఒక మంచి అకాడమిక్ బుక్స్ అనేవి సేకరించుకొని దాన్నిబట్టి ప్రిపేర్ అవ్వండి కచ్చితంగా మీకు మంచి మార్కులు అనేవి వస్తాయి.ఇందులో భాగంగా మనకు నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి ఏవైతే మీకు తెలిసినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిని మాత్రం ఆన్సర్ చేయాలి. మీకు ఒక 50% వరకు తెలిసినటువంటి బిట్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ కాంపిటీషన్లో స్కోరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు రానటువంటి ప్రశ్నలు వదలచు కానీ కొంచెం తెలిసి తెలియని ప్రశ్నలు ఏవైతే ఉంటే వాటిని కచ్చితంగా అటెంప్ట్ చేయాలి.