TG టెట్ పరీక్ష | TG TET Notification 2025 | TS TET Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG TET Notification 2025 – 26:

తెలంగాణలో TG TET Notification 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. అసలు టెట్ అంటే ఏంటి? టెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ TG TET Notification 2025 ఎక్సమ్ అనేది ఎవరెవరు రాయవచ్చు మరియు టెట్లో క్వాలిఫై మార్కులు ఎన్ని? ఇటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం.

TG TET Notification 2025

ముందుగా మనకు TET అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే D.ed, B.ed, HPT, TPT కోర్సెస్ కంప్లీట్ చేసి డీఎస్సీ రాయడానికి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా టెట్ పరీక్ష అనేది ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించాలి అప్పుడు మాత్రమే ఈ డీఎస్సీ పరీక్ష అనేది రాయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డీఎస్సీ పరీక్షలో మనకు టెట్ మార్కులలో 20% వెయిటేజ్ అనేది తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డీఎస్సీ రాయదలిచిన వారు ఖచ్చితంగా టెట్ నే మీరు క్షుణ్ణంగా చదువుకొని ప్రాపర్ గా రాసినట్లయితే మంచి మార్కులతో టీచర్ జాబ్ పొందవచ్చు.

Join Telegram Group

SSB Constable Recruitment 2026

టెట్ అంటే ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే టీచరు ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగం పొందే ముందు కచ్చితంగా TET Exam  పాస్ అవ్వాల్సిందే.

 ఈ పరీక్ష ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వారున్నారో వారికి టీచింగ్ పైన నాలెడ్జ్ అనేది ఉంటుంది.

TET  సాధారణంగా రెండు పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది.

  • Paper 1 – 1st to 5th Class 
  • Paper 2 – 6th to 8th Class / 10th Class

అర్హతలు?

ఈ టెట్ పరీక్ష అనేది రాయాలి అంటే ముందుగా మీకు Inter + D.ed or Degree + B.ed or HPT or TPT వంటి క్వాలిఫికేషన్ ఉండాలి.

  • Paper 1 – Inter + D.ed
  • Paper 2 – Degree + B.ed or HPT 

టెట్ ఎవరు రాయాలి?

టెట్ పరీక్ష అనేది ఎవరైతే D.ed, B.ed, HPT, TPT, సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఈ టెట్ అనేది కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి అంటే టెట్కి కచ్చితంగా ప్రిపేర్ కావాలి మరియు మీరు టిఎస్సి పరీక్ష రాయాలి అన్న కూడా టెట్ మార్కులు కీలకం. 2011 కన్నా ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ పోస్టు పొందినటువంటి వారందరూ కూడా టెట్ కచ్చితంగా రాయాలి మరియు ఉత్తీర్ణత సాధించాలి. కానీ ఇంకా ఎవరైతే రిటైర్మెంట్ కి ఐదు సంవత్సరాలు తేడాతో ఉన్నారో వారు టెట్ పరీక్ష అనేది రాయక్కర్లేదు వాళ్ళకి మినహాయింపు ఉంది అని చెప్పి రూల్ తీసుకువచ్చారు.

టెట్ అర్హత మార్కులు ఎన్ని?

టెట్లో అర్హత పొందాలి అంటే కనుక జనరల్ క్యాండిడేట్స్ కి 90 మార్కులు రావాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి 75, 60 మార్కులు రావాలి. కనీస అర్హత మార్కులు సాధించలేని వారందరూ కూడా ఫెయిల్ అయినట్టే.

టెట్ పరీక్షకి ఏం చదవాలి?

Paper 1 టెట్ పరీక్ష కైతే ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల టెక్స్ట్ బుక్కులు అన్నీ కూడా చదవాలి మరియు 10వ తరగతి వరకు ఉన్నటువంటి లింక్ టాపిక్స్ కూడా కచ్చితంగా చదవాలి. వీటికి అదనంగా సైకాలజీ మెథడాలజీ వంటివి కూడా చదవాలి.

పేపర్ 2 టెట్ పరీక్ష కైతే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి మీ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ లన్ని కూడా క్షుణ్ణంగా చదవడంతో పాటు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు లింకులు టాపిక్స్ అన్నీ కూడా చదవాలి.

TG TET – పరీక్ష విధానం?

  •  ఏ పేపర్ అయినా (Paper 1 & 2) సరే మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ అనేవి ఉంటాయి.
  •  ప్రతి ప్రశ్నకు 1 Mark అనగా మొత్తం 150 Marks
  •  ఇందులో ఏ విధమైనటువంటి నెగిటివ్ విధానం లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  •  దీనిలో క్వాలిఫై అవ్వాలంటే జనరల్ (UR) వాళ్ళకి 90 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి.BC – 75 & SC, ST – 60 Marks.

TET కి సిలబస్ ఏముంటుంది?

ఇందులో ప్రధానంగా మీరు చదవాల్సిందే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదువుకోవాలి.

  • చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాజి
  • Telugu
  • English
  • Maths
  • EVS – ఎన్విరాన్మెంటల్ స్టడీస్

పరీక్ష పాస్ అవడానికి ఎలా చదవాలి?

  • మీరు ముందుగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి.
  • ముందు మీరు ప్రీవియస్ జరిగిన టెట్ పరీక్షలు యొక్క PYQ – ప్రీవియస్ ఇయర్ క్యూస్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చూసుకోవాలి.. తద్వారా మీకు బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారు మరియు ఎక్కడ నుంచి మనకి బిట్ అనేది వస్తుంది అనేది ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది.
  • Mock Tests ప్రతిరోజు కూడా రాయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
  • వీక్ సబ్జెక్టు పైన కచ్చితంగా మీరు ఫోకస్ పెట్టినట్లయితే అందులో కూడా స్కోరింగ్ అనేది పొందే అవకాశం ఉంటుంది.
  • ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వదలకుండా మొత్తం అన్ని కూడా చదవాలి. మీరు విజయం సాధించాలి అంటే సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీరు మెదడుకి ఎక్కిస్తేనే మీరు మంచి స్కోర్ తో ముందంజలో ఉంటారు.

టెట్ పరీక్ష పాస్ అయితే తర్వాత ఏం చేయాలి?

TG TET పరీక్ష పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజీలో మీకు ప్రభుత్వం నుంచి DSC Notification విడుదల చేయడం జరుగుతుంది. మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ముందు నుంచి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకొని పరీక్ష రాయచ్చు. తద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం అనేది పొందవచ్చు.

మొదటిసారి టెట్ పరీక్ష రాస్తున్నారా?

  • మొదటిసారి మీరు TG TET పరీక్ష అనేది రాస్తున్నట్లయితే మీరు భయపడాల్సిన పనిలేదు. టెట్ పరీక్ష అనేది చాలా సులువుగా వస్తుంది డీఎస్సీ పరీక్షతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి మరీ డెప్త్గా మీకు ఏమీ పేపర్ అనేది రాదు.
  • SGT వాళ్లు తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు చదవడంతో పాటు వాటి యొక్క లింకప్ టాపిక్ లన్నీ కూడా 9th, 10th క్లాస్ పుస్తకాలలో చూసుకొని వాటిని కూడా ప్రిపేర్ అయినట్లయితే ఏ బిట్టు వదలకుండా చేయడానికి అవకాశం ఉంటుంది.
  • SA వారి విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు తప్పనిసరిగా స్కూల్ పుస్తకాలన్నీ చదవడంతో పాటు మీరు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సంబంధిత టాపిక్స్ అన్నీ కూడా చదవాలి.

TG TET పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు?

ప్రస్తుతానికి ఇంకా TG TET Notification 2025 రాలేదు మీకు చెప్పింది ఒక వారం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు కాబట్టి మీకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడానికి కనీసం ఒక నెల రోజులు సమయం తీసుకుంటారు. కావున యావరేజ్ గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 60 రోజులు సమయం మీకు ప్రిపరేషన్ కి ఉంటుంది.

టెట్ – Final Verdict?

TG TET పరీక్ష చాలా సులువుగా పాస్ అవ్వచ్చు. టెట్ పరీక్ష అనేది ఒక అర్హత పరీక్ష మాత్రమే కావున డిఫికల్టీ లెవెల్ అనేది మీడియం గా మాత్రమే ఉంటుంది. కావున మీరు ఒకవేళ టెట్లో ఉత్తీర్ణత సాధించాలి అనుకుంటే ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ ని ముద్దు పెట్టుకుని ప్రతి ఒక్క టాపిక్ ని కూడా టెక్స్ట్ బుక్ తో అనుసంధానం చేసుకొని కేవలం టెక్స్ట్ బుక్కులను మాత్రమే ప్రామాణికంగా చేసుకొని చదువుకున్నట్లయితే కనక ఈజీగా టెట్లో ఉత్తీర్ణత సాధించవచ్చు.

ఈ TG TET Notification 2025 పరీక్ష అనేది మీకు పేపర్ మీడియం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది కావున మీకు ఇందులో కన్వీనెంట్ అయితే అందులో మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు మరియు పేపర్ కూడా రాయవచ్చు. టెట్ నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలతో మరొకసారి మీకు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి.

DSC పరీక్షలో 80 మార్కులు మరియు TG TET పరీక్షలో 20 మార్కులు అనేది మనకి ఫైనల్ సెలక్షన్లో ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో TET పరీక్ష అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ మీకు టెట్ పరీక్ష క్వాలిఫై అయ్యి తక్కువ మార్కులు వచ్చినయ్ అనుకోండి మీరు కచ్చితంగా మరొకసారి మీరు టెట్ పరీక్ష అనేది రాసినట్లయితే మీ యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకూ ఈ టెట్ పరీక్షలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తద్వారా ఒకవేళ మీకు డీఎస్సీ పరీక్షలో ఒకటి రెండు మార్కులు కాస్త తక్కువగా వచ్చిన మీకు ఇది బెనిఫిట్ గా ఉంటుంది.

TET కి ఎలా అప్లై చేయాలి?

TG TET – Official Website అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు ఇతర వివరాలు ఉంటాయి పూర్తిస్థాయిలో మొత్తం అన్ని కూడా చదువుకున్న తర్వాత మీరు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

Apply Online & Official Website

Leave a Comment

error: Content is protected !!