NVS KVS Recruitment 2025:
నిరుద్యోగులు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కు సంబంధించిన భారీ NVS KVS Recruitment 2025 వచ్చేసింది.

ఈ NVS KVS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు మరియు సెలక్షన్ ప్రాసెస్ తదితర అంశాల గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలలో భాగంగా మనకు టీచింగ్ జాబ్స్ తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. 10th, 12th, Degree, B. Ed, D. Ed వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.
ఇందులో సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి Tier 1 & 2 పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం మీకు పరీక్షతోపాటు ఇంటర్వ్యూ మరియు డెమో కూడా ఉంటుంది.
Job Details :
ఈ NVS KVS Recruitment 2025 మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ కి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో భారీ మొత్తంలో పోస్టులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ వారు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Vacancies :
ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక 14,967 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మనకు టీచింగ్ జాబ్స్ ఉన్నాయి మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి.
PGT, TGT, PRT, Principal వంటి టీచింగ్ జాబ్స్ తో పాటు MTS, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వంటి విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
వికలాంగులకు శుభవార్త సదరం స్లాట్స్ ఓపెన్
ఉద్యోగిని పథకం – 3 లక్షల రుణాలు
Age:
ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా పోస్ట్ ఆధారంగా చేసుకుని 50 సంవత్సరాలు వరకు కూడా వయస్సు మీకు ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Women, PWD – 10 Years
Salary :
ఇక NVS KVS Recruitment 2025 లో విడుదల చేసినటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు విషయానికి వచ్చినట్లయితే గనుక పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మనకు దాదాపుగా ₹30,000/- to ₹80,000/- మధ్యలో అన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మీకు చేతికి అందుతుంది.
మీరు ఒకవేళ ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే గనక మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఉండడానికి రూమ్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు మరియు మీకు సంబంధించి క్వార్టర్స్ ఉంటాయి. మీకు భోజన సదుపాయం కూడా వాళ్ళు ఇస్తారు.
Important Dates :
ఈ ఒక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే Nov 14th to Dec 4th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవాలి.
వీటికి అప్లై చేసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ లో మీకు ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా ఉంటుంది దానిని ఫాలో అయిపోయి మీరు అయితే అప్లై చేయొచ్చు.
పరీక్ష తేదీ అనేది త్వరలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి నోటిఫికేషన్ లో ఇంకా ఇవ్వలేదు దాదాపుగా మనకొక రెండు నెలలు సమయం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Fee:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అనేవి క్రింది విధంగా ఉంటే ఒకసారి గమనించి దానికి అనుగుణంగా మీరైతే అప్లై చేసుకోండి. ఒక్కొక్క పోస్ట్ కి సపరేట్గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి గమనించండి.
SC, ST, PWD – 500/-
UR, OBC, EWS – 1700/- & ₹2,000/-
Apply Process:
ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో విడుదల చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఉంటుంది. ముందుగా మీరు వివరంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి దానితోపాటు మీకు ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేది మీరు బ్రేకప్ వేకెన్సీస్ లో చెక్ చేసుకోవాలి.
అన్ని క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత మీకు NVS KVS Recruitment 2025 లోనే క్లియర్ గా ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ అనేవి ఫాలో కావాలి అని చెప్పి. వాటిని ప్రాపర్ గా ఫాలో అవుతూ ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు అయితే అప్లై చేసుకోవాలి.