Aadhaar Card Biometric Camp 2025:
Aadhaar Card Biometric Camp 2025 – ఆంధ్రప్రదేశ్లోని నూతనంగా మనకు బడికి వెళ్లే పిల్లలకు సంబంధించి రోజుకు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 నుంచి 17 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి స్కూల్ పిల్లలు అనగా విద్యార్థులకు సంబంధించి కొత్తగా మనకు Aadhaar Card Biometric Camp 2025 సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది.. మరి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి వాటికి సంబంధించి మీరు చేయాల్సిందేంటి చేయకూడదేంటి వాటి అంశాలు అన్నీ కూడా చక్కగా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము.

అయితే స్కూలుకి వెళ్తున్నటువంటి పిల్లలు ప్రధానంగా 05 సంవత్సరం నుంచి 17వ సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 16వ తేదీ నుంచి మనకు యొక్క Aadhaar Card Biometric Camp 2025 అనేటటువంటివి ప్రారంభించడం జరుగుతుంది.. అయితే ఈ యొక్క క్యాంపులు అనేవి డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయి. వీటినే మళ్లీ ఒక రోజు సెలవు తీసుకొని డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 వరకు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ బడులలో వీటిని నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో మనకి ఆనందపడాల్సిన విషయం ఏంటి అంటే గనక ఈ బడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అనేది ఉచితంగానే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.ఈ అప్డేట్ తెలియడంతో చాలామంది విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు కావచ్చు చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చొరవ తీసుకొని విద్యార్థుల్ని తమ పిల్లలుగా భావించే విధంగా ఉచిత సర్వీసులు అందించడంతో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు.
Aadhaar Card Biometric Camp 2025 దేనికి?
ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయవలసిన అవసరం అయితే కచ్చితంగా ఉంటుంది. పిల్లలకి ఎవరికైతే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయా వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వీటిని నియమాలు అనుసరించి మీరు కచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు అప్డేట్ అనేది చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము.
- ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది ?
- ఆధార్ కార్డు యాక్టివేషన్ చేసే అవకాశం ఉంది
- ఫీజు రీయింబర్స్మెంట్ మీ పిల్లలకు సంబంధించి స్టాప్ చేస్తారు
- తల్లికి వందనం సంబంధించినటువంటి మీకు చేయకూడదు అంటే నిలిపివేయవచ్చు
- రేషన్ కార్డుకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా మీకు నిలిచిపోవచ్చు
- మీ పిల్లలకు సంబంధించి ప్రభుత్వ బడుల్లో గాని ప్రైవేటు బడుల్లో గాని చేర్పించే సమయంలో వెరిఫికేషన్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయవచ్చు.
జాబ్ క్యాలెండర్ సిద్ధం 99 వేల పోస్టులు
Aadhaar Card Biometric Camp 2025 ముఖ్య విషయం:
- మీ పిల్లలకు సంబంధించి ఆధారం బయోమెట్రిక్ అనేది చేయడానికి సంబంధించి క్రింది విషయాలు గమనించాలి.
- మీ పిల్లలకు సంబంధించి 10 చేతివేళ్లు ఫింగర్ ప్రింట్ తీస్తారు
- IRIS – పిల్లల యొక్క కంటి చూపుని స్కాన్ చేస్తారు
- FACE Photo – మీ పిల్లల ఫోటో తీస్తారు.
Aadhaar Card Biometric Camp 2025 – కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?
- ఒరిజినల్ లేదా జిరాక్స్ ఆధార్ కార్డు
- ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఆపరేషన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్
- పిల్లవాడు తప్పనిసరిగా ఉండాలి
- తల్లి లేదా తండ్రి సంరక్షణ కోసం ఉండవచ్చు..
ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఫారం ఎలా నింపాలి?
- ఆధార్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి
- ఫారం లో బయోమెట్రిక్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి
- మీ పిల్లలు సంతకం చేయడానికి ఇబ్బంది పడితే కనుక తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకొని సంతకం కూడా చేయవచ్చు
- దీనిని మీకో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధార్ కార్డు సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అప్డేట్ చేసి పెడతారు.
- ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు వీటిని బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు.
- అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు దాన్ని కూడా జాత పెట్టుకోండి.
- పది రోజులకు మీకు ఏదో ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది.
- కొత్త ఆధార్ కార్డు అనేది మీకు డైరెక్ట్ గా పంపిస్తారు.