Udyogini Scheme 2025:
Udyogini Scheme 2025 – మహిళలు కూడా తమ సొంత కాలిపై తాము నిలబడాలి అనే ఉద్దేశంతో ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారో వారి కోసం స్వయం ఉపాధి అనగా Self Employment కల్పించాలి వారు కూడా ముందుకు ఎదగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకమే ఉద్యోగిని పథకం ( Udyogini Scheme 2025 ).

ఈ Udyogini Scheme 2025 ద్వారా అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో ప్రత్యేకత ఏంటి అనేసి మనం చూసుకున్నట్లయితే గనక అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా No Interest Loan ఇవ్వడంతో పాటుగా 90,000 రూపాయల వరకు కూడా వారు తీసుకున్నటువంటి రుణం పైన సబ్సిడీ కూడా లభిస్తుంది.
ఉద్యోగిని పథకం ఉపయోగాలు :
Women Empowerment ప్రధాన ధ్యేయంగా మరియు మహిళలు కూడా ఎంటర్ప్రైజెస్ అవ్వాలి మరియు వారు కూడా సొంతంగా వ్యాపారాలు చేయాలి మరియు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఈ Udyogini Scheme 2025 అనేది ప్రారంభించడం జరిగింది. ఆర్థికంగా వెనకబడి పెట్టుబడికి డబ్బు లేని వారు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలకి ఈ పథకం ద్వారా ఉపాధి అనేది పొందవచ్చు.
నవంబరు 10th, 11th, 14th తేదీలలో సెలవులు
Udyogini Scheme 2025 – Loan Details :
ఈ యొక్క Udyogini Scheme 2025 ద్వారా అర్హులైనటువంటి మహిళలకు గరిష్టంగా 3 లక్షల వరకు కూడా వారు పెట్టుబడి కోసం రుణాలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండానే మీకు రుణాలు అనేవి కేంద్ర ప్రభుత్వం వాళ్లు ఇస్తున్నారు.
మీరు మళ్లీ రుణం అనేది చెల్లించడానికి వాళ్లు మీకు 3 నుంచి గరిష్టంగా 7 సంవత్సరాలు వరకు కూడా సమయం ఇస్తున్నారు.
సబ్సిడీ వివరాలు:
SC, ST, PWD, వితంతువులు వంటి వారందరికీ కూడా వడ్డీ లేకుండానే మీకు ఈ యొక్క లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సబ్సిడీ విషయానికి వచ్చినట్లయితే గనక గరిష్టంగా మీకు 50% సబ్సిడీ అనగా 90 వేల రూపాయలు మీకు సబ్సిడీ అనేది కలుగుతుంది.
UR, OBC సంబంధించినటువంటి వారికైతే కనక సబ్సిడీలో 30% వరకు కూడా మీకు కలుగుతుంది. అయితే మిగిలినటువంటి లోన్ పైన మీకు అతి తక్కువ వడ్డీ రేటు అనగా 10% to 12% మధ్యలోనే మీకు వడ్డీ తోటి మీకు ఈ లోన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఎంత అద్భుతమైనటువంటి పథకం అనేది మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్లు మహిళల కోసం ఇస్తున్నారు కాబట్టి వాళ్లకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే.
ఇటువంటి వడ్డీ లేకుండా రుణాలు లేదా అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తూ వీటికి అదనంగా సబ్సిడీ తోడైతే గనక మహిళలందరూ కూడా చక్కగా వారి కాళ్ళ పైన వాళ్ళు నిలబడుతూ వాళ్లు కూడా పెట్టుబడులు అనేవి వివిధ వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్లు కూడా గౌరవప్రదమైనటువంటి జీవనం సాగించడానికి ఎటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి.
ఎటువంటి వ్యాపారాలకి Loans ఇస్తారు?
- బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ ( జుట్టు కటింగ్ షాపు )
- కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పలహారాలు బిజినెస్
- పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు వంటి డైరీ సంబంధిత షాప్
- అగరబత్తీలు తయారీ కేంద్రాలు
- బేకరీ ఐటమ్స్ – బ్రెడ్, ఎగ్ పప్పు మరియు కర్రీ పఫ్ లాంటివి
- చేనేత మరియు ఎంబ్రాయిడరీ కి సంబంధించినటువంటి బిజినెస్
- క్యాటరింగ్ బిజినెస్
ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు?
- Age : 18 – 55
- Annual Income : ₹2 లక్షల లోపు
- Caste : SC, ST, OBC, PWD, Widows
కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?
- అప్లికేషన్ ఫారం (Application Form)
- ఒరిజినల్ ఆధార్ కార్డు
- మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- మీరు పెట్టదలుచుకున్న బిజినెస్ డీటెయిల్స్
- క్యాస్ట్ సర్టిఫికెట్ (Caste)
- మీ కుటుంబ ఇన్కమ్ సర్టిఫికెట్
- డేటాఫ్ బర్త్ (DOB)
ఎలా అప్లై చేయాలి?
Udyogini Scheme Online వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. లేదా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి రీజినల్ రూరల్ బ్యాంకు, కో-ఆపరేటివ్ బ్యాంకు లేదా కమర్షియల్ బ్యాంకు వద్దకు వెళ్లి మీరు వివరాలు చెప్తే వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా చెప్తారు.
- SBI – MSME PORTAL ద్వారా మీరు ఉద్యోగిని పథకానికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీప బ్రాంచ్ లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో కూడా పెట్టొచ్చు.
- సరస్వత్ బ్యాంక్ – మైక్రో ఎంటర్ప్రైజెస్ నుండి చిన్నచిన్న వ్యాపారాలు దాకా కూడా మీకు 10 లక్షలు నుంచి గరిష్టంగా రెండు కోట్ల వరకు కూడా వీళ్ళు మీకు లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి 11.5% ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది.
- పంజాబ్ & సింద్ బ్యాంక్ – ఈ బ్యాంకు వాళ్లు కూడా అతి తక్కువ వడ్డీ రేటు అనగా 9.65% వడ్డీ రేటు చొప్పున 25 వేల వరకు కూడా మీకు లోన్స్ అనేవి వీళ్ళు అందించడంఈ బ్యాంకు వాళ్లు కూడా అతి తక్కువ వడ్డీ రేటు అనగా 9.65% వడ్డీ రేటు చొప్పున 25 వేల వరకు కూడా మీకు లోన్స్ అనేవి వీళ్ళు అందించడం జరుగుతుంది.
- Bajaj Finserv – అసలు వడ్డీ లేకుండా మూడు లక్షల వరకు కూడా మహిళలకు రుణాలు అందిస్తున్నారు.
Final Verdict :
ఈ ఉద్యోగిని పథకం 2025 మహిళలకు చాలా మంచి బెనిఫిట్స్ ని కల్పించడంతోపాటు వాళ్లు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో తీసుకువచ్చినటువంటి బహు చక్కనైనటువంటి పథకంగా చెప్పొచ్చు. అర్హులైన ముఖ్య అర్హులైన ముఖ్యమంత్రి మహిళలు అందరూ మహిళలు అందరూ కూడా అవకాశం ఉంటే ఈ యొక్క పథకాన్ని వినియోగించుకొని మీరు కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించుకోండి.