TG TET Notification 2025:
తెలంగాణలో TG TET Notification 2025 వారం రోజుల్లో విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సిద్ధమవడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. అసలు టెట్ అంటే ఏంటి? టెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ TG TET Notification 2025 ఎక్సమ్ అనేది ఎవరెవరు రాయవచ్చు మరియు టెట్లో క్వాలిఫై మార్కులు ఎన్ని? ఇటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం.

ముందుగా మనకు TET అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే D.ed, B.ed, HPT, TPT కోర్సెస్ కంప్లీట్ చేసి డీఎస్సీ రాయడానికి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా టెట్ పరీక్ష అనేది ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించాలి అప్పుడు మాత్రమే ఈ డీఎస్సీ పరీక్ష అనేది రాయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డీఎస్సీ పరీక్షలో మనకు టెట్ మార్కులలో 20% వెయిటేజ్ అనేది తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డీఎస్సీ రాయదలిచిన వారు ఖచ్చితంగా టెట్ నే మీరు క్షుణ్ణంగా చదువుకొని ప్రాపర్ గా రాసినట్లయితే మంచి మార్కులతో టీచర్ జాబ్ పొందవచ్చు.
టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు?
తెలంగాణ రాష్ట్రంలో మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఈ నెలలోనే ఒక వారం రోజుల్లో విడుదల చేస్తాము అని విద్యాశాఖ అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. రూల్ ప్రకారం ప్రతి ఏటా కూడా రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి. ఈ సంవత్సరంలో మొదటి విడత టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రెండవ విడత కింద మనకు TG TET Notification 2025 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది ఒక వారం రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.
నవంబరు 10th, 11th, 14th తేదీలలో సెలవులు
ఇంత హడావిడిగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే గనక మనకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా వారు కూడా టెట్టు పరీక్ష పాస్ అవ్వాలి. 2011 ముందు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఉంటారు వారు టెట్ అనేది రాయలేదు కాబట్టి వారందరూ కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాలి అని చెప్పి కొత్తగా రూల్ పెట్టారు. కావున వారందరూ కూడా ప్రస్తుతం టెట్కి ప్రిపేర్ అవుతున్నారు.
టెట్ ఎవరు రాయాలి?
టెట్ పరీక్ష అనేది ఎవరైతే D.ed, B.ed, HPT, TPT, సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఈ టెట్ అనేది కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి అంటే టెట్కి కచ్చితంగా ప్రిపేర్ కావాలి మరియు మీరు టిఎస్సి పరీక్ష రాయాలి అన్న కూడా టెట్ మార్కులు కీలకం. 2011 కన్నా ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ పోస్టు పొందినటువంటి వారందరూ కూడా టెట్ కచ్చితంగా రాయాలి మరియు ఉత్తీర్ణత సాధించాలి. కానీ ఇంకా ఎవరైతే రిటైర్మెంట్ కి ఐదు సంవత్సరాలు తేడాతో ఉన్నారో వారు టెట్ పరీక్ష అనేది రాయక్కర్లేదు వాళ్ళకి మినహాయింపు ఉంది అని చెప్పి రూల్ తీసుకువచ్చారు.
టెట్ అర్హత మార్కులు ఎన్ని?
టెట్లో అర్హత పొందాలి అంటే కనుక జనరల్ క్యాండిడేట్స్ కి 90 మార్కులు రావాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి 75, 60 మార్కులు రావాలి. కనీస అర్హత మార్కులు సాధించలేని వారందరూ కూడా ఫెయిల్ అయినట్టే.
టెట్ పరీక్షకి ఏం చదవాలి?
Paper 1 టెట్ పరీక్ష కైతే ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల టెక్స్ట్ బుక్కులు అన్నీ కూడా చదవాలి మరియు 10వ తరగతి వరకు ఉన్నటువంటి లింక్ టాపిక్స్ కూడా కచ్చితంగా చదవాలి. వీటికి అదనంగా సైకాలజీ మెథడాలజీ వంటివి కూడా చదవాలి.
పేపర్ 2 టెట్ పరీక్ష కైతే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి మీ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ లన్ని కూడా క్షుణ్ణంగా చదవడంతో పాటు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు లింకులు టాపిక్స్ అన్నీ కూడా చదవాలి.
టెట్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు?
ప్రస్తుతానికి ఇంకా TG TET Notification 2025 రాలేదు మీకు చెప్పింది ఒక వారం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు కాబట్టి మీకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడానికి కనీసం ఒక నెల రోజులు సమయం తీసుకుంటారు. కావున యావరేజ్ గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 60 రోజులు సమయం మీకు ప్రిపరేషన్ కి ఉంటుంది.
టెట్ ఎలా పాస్ అవ్వాలి?
టెట్ పరీక్ష చాలా సులువుగా పాస్ అవ్వచ్చు. టెట్ పరీక్ష అనేది ఒక అర్హత పరీక్ష మాత్రమే కావున డిఫికల్టీ లెవెల్ అనేది మీడియం గా మాత్రమే ఉంటుంది. కావున మీరు ఒకవేళ టెట్లో ఉత్తీర్ణత సాధించాలి అనుకుంటే ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ ని ముద్దు పెట్టుకుని ప్రతి ఒక్క టాపిక్ ని కూడా టెక్స్ట్ బుక్ తో అనుసంధానం చేసుకొని కేవలం టెక్స్ట్ బుక్కులను మాత్రమే ప్రామాణికంగా చేసుకొని చదువుకున్నట్లయితే కనక ఈజీగా టెట్లో ఉత్తీర్ణత సాధించవచ్చు.
ఈ TG TET Notification 2025 పరీక్ష అనేది మీకు పేపర్ మీడియం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది కావున మీకు ఇందులో కన్వీనెంట్ అయితే అందులో మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు మరియు పేపర్ కూడా రాయవచ్చు. టెట్ నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలతో మరొకసారి మీకు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి.