BOB Recruitment 2026:
ప్రభుత్వ రంగ బ్యాంకులలో Bank of Baroda అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మొత్తం 5000 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి సంబంధించినటువంటి BOB Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.
![]()
Any Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. ₹15000/- . నెలవారీ మీకు Stipend అయితే ఇవ్వడం జరుగుతుంది.
సంస్థ గురించి
బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనకి చూసుకున్నట్లయితే ఒక బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి ఒక బ్యాంకుగా చెప్పొచ్చు. మన దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాలలో వీళ్ళకి సంబంధించిన బ్యాంకులు పెట్టడం జరిగింది.
IAF Group C Civilian Recruitment 2026
రిక్రూట్మెంట్ ముఖ్యాంశాలు
- సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)
- పోస్టు పేరు: అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు: 5000
- ఉద్యోగ విధానం: Training(Apprenticeship)
- శిక్షణ కాలం: 12 Months
- నెలవారీ స్టైపెండ్: ₹15,000/-
- విద్యార్హత: ఏదైనా డిగ్రీ
- వయస్సు: 20 నుండి 28 సంవత్సరాలు
- దరఖాస్తు ప్రారంభం: 19 మే 2026
- చివరి తేదీ: 08 జూన్ 2026
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాష పరీక్ష
- దరఖాస్తు విధానం: Online
Vacancies
ఈ BOB Recruitment 2026 లో మొత్తం 5000 అప్రెంటిస్ సీట్లు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో – 188 పోస్టులు,
- తెలంగాణలో – 83 పోస్టులు,
- తమిళనాడులో – 199 పోస్టులు,
- కర్ణాటకలో – 483 పోస్టులు,
- మహారాష్ట్రలో – 580 పోస్టులు,
- ఉత్తరప్రదేశ్‌లో – 764 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రత్యేక అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 188 పోస్టులు కేటాయించబడ్డాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు ప్రాంతాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి కచ్చితంగా మనకి సొంత రాష్ట్రంలో జాబ్ పొందొచ్చు.
తెలంగాణ అభ్యర్థులకు పోస్టులు
తెలంగాణ రాష్ట్రానికి 83 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్లేసెస్ లో కూడా మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాంతాలలో మనకు శిక్షణ కేంద్రాలు ఉండేవి ఏర్పడి చేయడం జరిగింది.
విద్యార్హత
Any Degree గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో చేసి ఉండాలి.
వయస్సు పరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- Cutoff తేదీ: 01 May 2026
వయస్సు సడలింపు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు: 10 నుండి 15 సంవత్సరాల వరకు
శిక్షణ కాలం
12 Months పాటు మీకు on the job ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
స్టైపెండ్ వివరాలు
ప్రతి ఎంపికైన అప్రెంటిస్‌కు నెలకు ₹15,000 స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:
- ఆన్‌లైన్ పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్
ఆన్‌లైన్ పరీక్ష నమూనా
| అంశం | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 25 | 25 |
| క్వాంటిటేటివ్ & రీజనింగ్ | 25 | 25 |
| కంప్యూటర్ నాలెడ్జ్ | 25 | 25 |
| జనరల్ ఇంగ్లీష్ | 25 | 25 |
- మొత్తం ప్రశ్నలు: 100
- మొత్తం మార్కులు: 100
- వ్యవధి: 60 నిమిషాలు
- నెగెటివ్ మార్కింగ్ లేదు
స్థానిక భాష పరీక్ష
మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరికీ కూడా లోకల్ లాంగ్వేజ్ సంబంధించి అనగా తెలుగు లేదా ఉర్దూకి సంబంధించినటువంటి ప్రావీణ్య పరీక్ష అనేది కచ్చితంగా పెడతారు. 10th / 12th క్లాసెస్ లో భాగంగా ఒకవేళ మీకు ప్రాంతీయ భాష అనేది మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్టుగా ఉన్నట్లయితే ఈ యొక్క పరీక్షకి మినహాయింపు ఉంటుంది.
నేర్చుకునే ముఖ్య అంశాలు
- కస్టమర్ ఖాతాల నిర్వహణ – అనగా వారికి సంబంధించినటువంటి ఈ పాస్ పుస్తకాలు అనేవి వెరిఫై చేయడం కానీ లేదంటే వాళ్లకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్లో తోడ్పడడం కానీ మీరు చేయవలసి ఉంటుంది
- డిపాజిట్ మరియు విత్‌డ్రాయల్ విధానాలు – తెలియని వారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్లకి ఆ ఫారం నింపడంలో వాళ్లకే హెల్ప్ చేయాలి
- పాస్‌బుక్ అప్‌డేట్ విధానం – పాస్ పుస్తకాలలో ప్రింటింగ్ తీయడం
- డిజిటల్ బ్యాంకింగ్ సేవలు – ఆన్లైన్ బ్యాంకింగ్ ఏ విధంగా తోడ్పడుతుంది దాని వల్ల ఉపయోగాలు ఏంటి మరియు దానికి సంబంధించి ఏ విధంగా మనం వర్క్ అనేది చేయాలి అనేది చెప్పాలి
- UPI, IMPS, NEFT, RTGS వంటి లావాదేవీలు
- ATM మరియు డెబిట్ కార్డ్ సేవలు
- KYC ప్రక్రియ
- రుణాల ప్రాథమిక అవగాహన
- ఫిర్యాదుల పరిష్కారం
ఈ సర్టిఫికేట్ వల్ల:
- రెజ్యూమే కచ్చితంగా స్ట్రాంగ్ గా అవుతుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి
- ఇంటర్వ్యూలలో మీకు కచ్చితంగా ఒక స్థానంలో పెడతారు
- ప్రైవేట్ బ్యాంకుల్లో సెలెక్ట్ అవడానికి ఉపయోగపడుతుంది
- ఫైనాన్షియల్ సెక్టార్‌లో కెరియర్ ప్రారంభించడానికి ఇది ఒక పునాదిగా ఉంటుంది
- ప్రాక్టికల్ అనుభవం కావున మీకు ఏదైనా సెక్టార్లో మీకు కచ్చితంగా అవకాశం బాగుంటుంది.
ఈ అవకాశానికి ఎవరు దరఖాస్తు చేయాలి?
ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా క్రింది అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుంది:
- ప్రజెంట్ రీసెంట్గా డిగ్రీ పూర్తి చేసిన వారు
- బ్యాంకింగ్ విభాగంలో కెరియర్ అనేది స్టార్ట్ చేద్దామని చూస్తున్న వాళ్ళు
- గవర్నమెంట్ జాబ్ ని ఈజీగా క్రాక్ చేయాలి అనుకునేవారు
- ప్రెషర్ గా ఉంటూ ఎక్స్పీరియన్స్ లేనివారు
- ఫైనాన్షియల్ రంగంపై ఆసక్తి ఉన్న వారు
- స్థిరమైన కెరీర్‌కు పునాది వేయాలనుకునేవారు
ఆన్‌లైన్ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
ఎంపికలో ఆన్‌లైన్ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చు.
1. జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్‌నెస్
ప్రస్తుత ఆర్థిక పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం, ప్రభుత్వ పథకాలు చదవాలి.
2. రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్
రోజూ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
3. కంప్యూటర్ నాలెడ్జ్
MS Office, ఇంటర్నెట్, సైబర్ భద్రత వంటి అంశాలు చదవాలి.
4. ఇంగ్లీష్
వ్యాకరణం, వాక్య నిర్మాణం, పదసంపదపై దృష్టి పెట్టాలి.
స్థానిక భాష ప్రాధాన్యం
ఇందులో మనకు మెయిన్ గా లోకల్ భాష అంటే లోకల్ ప్రాంతాలలో మాట్లాడే భాష కచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు సంబంధించి మీరు మాట్లాడితేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ ప్రాంతీయ భాష అనేది మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి వాళ్లు మాత్రమే ఇందులో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది.
ఉద్యోగ హామీ లేకపోయినా ఎందుకు ఉపయోగకరం?
అప్రెంటిస్ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్‌లో శాశ్వత ఉద్యోగం హామీగా ఇవ్వబడదు. అయితే ఈ శిక్షణ ద్వారా పొందే అనుభవం అమూల్యమైనది.
దీర్ఘకాల ప్రయోజనాలు
- బ్యాంకింగ్ రంగంపై లోతైన అవగాహన
- ప్రొఫెషనల్ నైపుణ్యాల అభివృద్ధి
- కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుదల
- టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవడం
- ఉద్యోగ అవకాశాల పెరుగుదల
స్టైపెండ్‌ను ఎలా ఉపయోగించుకోవాలి?
ప్రతి నెల ₹15,000 స్టైపెండ్ లభించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు.
- పరీక్ష ఫీజులు
- పుస్తకాలు
- ఆన్‌లైన్ కోర్సులు
- కుటుంబ అవసరాలు
- పొదుపు
శిక్షణ సమయంలో అభివృద్ధి చెందే వ్యక్తిగత నైపుణ్యాలు
- కస్టమర్ హ్యాండ్లింగ్
- కమ్యూనికేషన్
- బాధ్యత
- డిసిప్లిన్
- టీమ్ వర్క్
- సమస్య పరిష్కారం
- విశ్లేషణాత్మక ఆలోచన
భవిష్యత్ కెరీర్ అవకాశాలు
ఈ అనుభవం ఆధారంగా క్రింది రంగాల్లో అవకాశాలు పెరుగుతాయి:
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు
- ప్రైవేట్ బ్యాంకులు
- NBFCలు
- ఇన్సూరెన్స్ కంపెనీలు
- ఫిన్‌టెక్ సంస్థలు
- కస్టమర్ సపోర్ట్ రంగం
దరఖాస్తు ఫీజు
- SC/ST/PwBD అభ్యర్థులకు: ₹200/-
- General/EWS/OBC (పురుషులు): ₹800/-
- General/EWS/OBC (మహిళలు / ట్రాన్స్‌జెండర్): ₹600/-
దరఖాస్తు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- అన్ని డాక్యుమెంట్లు ఉండాల్సిందే.. ఒకవేళ లేని పక్షంలో సిద్ధం చేసుకోవాలి
- NATS/NAPS నమోదు పూర్తి చేయండి
- చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా మీరు ముందుగానే అప్లై చేసుకుంటే మంచిది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది
- కేవలం సరైన సమాధానాలు మాత్రమే అందులోని మీరు నమోదు చేయవలసి ఉంటుంది
- అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి
ఎవరు దరఖాస్తు చేయరాదు?
క్రింది పరిస్థితుల్లో ఉన్న అభ్యర్థులు అర్హులు కారు:
- మీరు గతంలో ఒకవేళ ఈ BOB Recruitment 2026 శిక్షణ తీసుకున్నట్లయితే అప్లై చేయడానికి లేదు
- ప్రెసెంట్ మీరు ఏదైనా విభాగంలో అప్రెంటిస్ లో ప్రస్తుతం కొనసాగుతున్నట్లయితే కూడా మీకు అవకాశం లేదు
- గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి అవకాశం లేదు
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- సంతకం
- 10వ, 12వ మార్కుల మెమోలు
- డిగ్రీ సర్టిఫికేట్/ప్రొవిజనల్
- బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్ లీఫ్
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా Apprenticeship India మరియు NATS Portal లో నమోదు చేసుకోవాలి.
- తర్వాత Bank of Baroda Careers లేదా BFSI SSC ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలి.
- అవసరమైన ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 19 మే 2026
- చివరి తేదీ: 08 జూన్ 2026
అప్రెంటిస్ ఉద్యోగం అంటే ఏమిటి?
BOB Recruitment 2026 అంటే ఏంటి అంటే ఇది మనకి పూర్తిస్థాయి జాబ్ ఏమి కాదు ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రై.. అంతేకాకుండా మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్ చేసినట్లు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వలన మనకు యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తే గనుక మీకు అందులో యూస్ అవుతుంది.
ఈ అవకాశాన్ని ఎందుకు మిస్ అవ్వకూడదు?
- ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంకులో శిక్షణ
- నెలకు ₹15,000 స్టైపెండ్
- ఏదైనా డిగ్రీ అర్హత
- దేశవ్యాప్తంగా 5000 పోస్టులు
- బ్యాంకింగ్ రంగంలో ప్రత్యక్ష అనుభవం
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్
- భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు బలమైన ప్రొఫైల్
విజయం సాధించేందుకు సూచనలు
- BOB Recruitment 2026 – ప్రతిరోజూ 4 – 5 గంటలు చదవండి
- మాక్ టెస్టులుఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు భయం అనేది పోతుంది ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కచ్చితంగా దానికి సంబంధించి రిలేటెడ్ పరీక్షలు అనేవి రాయడం ద్వారా మనం కచ్చితంగా ముందడుగులో ఉంటాం
- కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి మెయిన్ గా ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి న్యూస్ పేపర్ ని ఎంపిక చేసుకొని దాన్ని ప్రాపర్ గా చదవండి
- టైమ్ మేనేజ్‌మెంట్‌పై బాగా కేంద్రకరించడం ద్వారా మీరు ఎగ్జామ్ సమయంలో టైమ్ ని మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు
- స్థానిక భాషలో నైపుణ్యం పెంచుకోండి
ముగింపు
ఎవరైతే బ్యాంకింగ్ విభాగంలో తమ యొక్క కెరియర్ అనేది ప్రారంభిస్తామని చూస్తున్నటువంటి వారు ఉన్నారు వారు కచ్చితంగా ఇటువంటి అప్రెంటిస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యుటిలైట్ చేసుకోవడం మంచిది.. ఎందుకు అనగా ఇప్పుడు కాలంలో మనం చూసుకున్నట్లయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మనకి జాబ్స్ రావడం చాలా అంటే చాలా కష్టమైపోతూ ఉంది. ఇటువంటి సిచువేషన్ లో మనకి కానీ ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్ ఉందంటే మనకి ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబ్ పొందడానికి కొంచెం ఉపయోగపడుతుంది.